నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌

నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా.. ఫిన్లాండ్‌‌‌‌లో జరుగుతున్న కౌర్టెన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. శనివారం జరిగిన పోటీల్లో నీరజ్‌‌‌‌ జావెలిన్‌‌‌‌ను 86.96 మీటర్ల దూరం విసిరి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ ఈ దూరాన్ని అందుకోవడం విశేషం. రెండో ప్రయత్నంలో ఫౌల్‌‌‌‌ అయిన నీరజ్‌‌‌‌.. మూడో త్రోలో కిందపడిపోయాడు. వర్షంతో ట్రాక్​ తడిగా ఉండటంతో చివరి మూడు త్రోలకు  దూరంగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ తర్వాత నీరజ్‌‌‌‌ గెలిచిన తొలి టైటిల్‌‌‌‌ ఇది. ఈ వారంలో  ఫిన్లాండ్​లోనే జరిగిన పావో నరుమి గేమ్స్‌‌‌‌లో 89.30 మీటర్ల దూరంతో తన నేషనల్‌‌‌‌ రికార్డును బద్దలు కొట్టిన నీరజ్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ గెలిచాడు.