ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం.. అంబానీ వర్సెస్ బెజోస్.

ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం.. అంబానీ వర్సెస్ బెజోస్.
  • రూ.38 వేల కోట్లని అంచనా

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ, జెఫ్‌‌‌‌‌‌‌‌ బెజోస్‌‌‌‌‌‌‌‌ మధ్య మరోసారి డైరెక్ట్ పోటీ నెలకొననుంది. ఫ్యూచర్ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను కొనేందుకు తీవ్రంగా పోటీ పడుతున్న ఈ ధనవంతులు, ఈ సారి క్రికెట్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో తాడోపేడో తేల్చుకోనున్నారు. దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎల్‌‌‌‌‌‌‌‌) కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గానే కాకుండా బిజినెస్‌‌‌‌‌‌‌‌గా కూడా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్‌‌‌‌‌‌‌‌ హక్కుల కోసం రిలయన్స్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రిలయన్స్‌‌‌‌‌‌‌‌ తన వయాకామ్‌‌‌‌‌‌‌‌ 18, జియో డిజిటల్‌‌‌‌‌‌‌‌ ద్వారా, అమెజాన్‌‌‌‌‌‌‌‌ తన ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్ చేయాలని చూస్తున్నాయి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ బాగా సక్సెస్ అయ్యిందన్న విషయం తెలిసిందే. మ్యాచ్ అవుతుంటే  కోట్ల మంది టీవీలు, హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు తమ టైమ్‌‌‌‌‌‌‌‌ను గడుపుతున్నారు.  కిందటి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ వ్యూవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌  24,200 కోట్ల  నిమిషాలకు పెరిగింది. ప్రస్తుతం పది సెకెన్ల టీవీ స్పాట్‌‌‌‌‌‌‌‌ కోసం ఏకంగా రూ. 17 లక్షలు ఖర్చు చేయాల్సిందే.  డిస్నీకి యాడ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ, సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ భారీగా వస్తోంది. టీమ్‌ల వాల్యుయేషన్‌లు బిలియన్ డాలర్‌‌కు పెరిగాయి.   ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ ఫుల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌గా ఎదిగిందనడానికి ఇవే రుజువులు.

ఈ సారి వాల్యూ డబుల్‌‌‌‌‌‌‌‌..

ఐదేళ్ల మీడియా రైట్స్ కోసం  2017 లో  స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌  2.55 బిలియన్ డాలర్ల (రూ. 19,380 కోట్ల) కు డీల్‌‌‌‌‌‌‌‌ను కుదుర్చుకుంది. రుపట్‌ ముడక్‌ నాయకత్వంలోని 21 సెంచురీ ఫాక్స్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకుంది. ఆ తర్వాత 21 సెంచురీ ఫాక్స్‌‌‌‌‌‌‌‌లోని తన ఆస్తులను వాల్ట్‌‌‌‌‌‌‌‌ డిస్నీకి ఆయన అమ్ముకున్నారు. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచులను లైవ్‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్ 600 మిలియన్ డాలర్లను అప్పుడు ఆఫర్ చేసింది కూడా.   ప్రస్తుతం ఐపీఎల్ మీడియా రైట్స్ వాల్యూ  5 బిలియన్ డాలర్ల (రూ. 38 వేల కోట్ల) కు మించుతుందని అంచనా. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ 12 న ఐపీఎల్ మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం వేలం
 వేయనున్నారు. 
గట్టిగా ప్రయత్నిస్తున్న అమెజాన్‌‌‌‌‌‌‌‌..
ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో కింద స్ట్రీమింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందిస్తున్న  అమెజాన్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోకి కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే  ఇంగ్లిష్​ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాకర్ లీగ్‌‌‌‌‌‌‌‌ను బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్ చేస్తోంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పొందేందుకు కంపెనీ గట్టిగా ప్రయత్నించనుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. తన రిటైల్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించడానికి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ సాయపడుతుందని భావిస్తున్నారు. దేశంలో మెజార్టీ రిటైల్ సెక్టార్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మల్‌‌‌‌‌‌‌‌గానే ఉంది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింతగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ లాంటి సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ను పొందితే తమ రిటైల్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను కూడా ఈ కంపెనీలు విస్తరించుకోవడానికి వీలుంటుంది. దేశంలో  ఒక ఏడాదిలో సగటున 65 రోజుల పాటు ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో 325 రోజుల పాటు మ్యాచులు జరుగుతాయి. కోట్ల మంది ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ కోసం టీవీలకు అతుక్కు పోతారు. కంపెనీలు తమ రిటైల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడానికి, తమ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్ముకోవడానికి ఇంత కంటే మంచి అవకాశం ఉండదు. అందుకే రిలయన్స్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌లు ఈ సారి మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ను పొందేందుకు గట్టిగా ప్రయత్నించనున్నాయి. 
బరిలో ఎంత మంది ఉంటారంటే?..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్ మీడియా వయాకామ్‌‌‌‌‌‌‌‌18తో ఐపీఎల్ రైట్స్ కోసం ప్రయత్నించనుండగా, జీ–సోనీ,  ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, గూగుల్ (యూట్యూబ్‌‌‌‌‌‌‌‌), యాపిల్ వంటి కంపెనీలు కూడా ఐపీఎల్ మీడియా రైట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గూగుల్‌‌‌‌‌‌‌‌కు, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌కు జియోలో వాటాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో  ఈ కంపెనీలు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా మీడియా రైట్స్ కోసం పోటీ పడకపోవచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. యాపిల్ యూఎస్‌‌‌‌‌‌‌‌లో మేజర్‌‌‌‌‌‌‌‌ బేస్‌బాల్‌ లీగ్‌‌‌‌‌‌‌‌ను టెలీకాస్ట్ చేస్తోంది.

ఇంకా ఇండియాలో తన ఫోన్ల అమ్మకాలను పెంచుకోలేదు. ఆ తర్వాత గాని తన యాపిల్‌‌‌‌‌‌‌‌ టీవీ+ ను విస్తరించడంపై కంపెనీ దృష్టి పెట్టకపోవచ్చని అంచనా.  కస్టమర్లు తగ్గిపోతుండడంతో  నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ ఇప్పుడు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టే అవకాశం లేదు. దీంతో ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం అసలైన పోటీ అంబానీ, అమెజాన్‌‌‌‌‌‌‌‌, డిస్నీ మధ్యనే నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీ-సోనీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది.