డిసెండింగ్​ ఆర్డర్​లో కొలువులు భర్తీ చేయాలి

డిసెండింగ్​ ఆర్డర్​లో కొలువులు భర్తీ చేయాలి
  • గురుకుల నియామకాల్లో రీలింకిష్ మెంట్ విధానం పాటించండి
     

  • బీఎస్పీ స్టేట్​చీఫ్​ఆర్.ఎస్ ప్రవీణ్ కుమా


హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాసంస్థలు నియామక మండలి ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్ మెంట్ విధానం పాటించి, అవరోహణ క్రమంలో కొలువులు భర్తీ చేయాలని బీఎస్పీ స్టేట్​చీఫ్​ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిలిస్తుంది. ఇటీవల బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఏదో ఒక జాబ్​ను ఎంచుకొని మిగతా వాటిని వదిలేస్తున్నారు. 

ఆ అభ్యర్థి వదిలివెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుంది. బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి అవరోహణ క్రమంలో కొలువులు భర్తీ చేయాలి. ఉద్యోగాలు ఖాళీగా మిగలకుండా ఉండాలంటే అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా సెకండ్​లిస్ట్​రిలీజ్​చేయాలి’ అని ఆర్ఎస్పీ కోరారు.