స్థానిక సంస్థల ఎన్నికల్లోగెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మంత్రి జూపల్లి

 స్థానిక సంస్థల ఎన్నికల్లోగెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మంత్రి జూపల్లి
  • ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఇన్​చార్జి మంత్రి జూపల్లి సూచనలు

నిర్మల్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూప-ల్లి కృష్ణారావు అన్నారు. మంత్రి జూపల్లి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్​లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో అభ్యర్థుల ఎంపికపై, ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లాల్లో ముఖ్య నాయకులను సంప్రదించి ఏకాభిప్రాయంతో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అన్ని పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. 

ఎన్నికల ప్రచారం కోసం క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలుపై విస్త్రృతంగా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, లోక్ సభ ఇన్ చార్జి సుగుణ, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, విశ్వప్రసాద్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ బాపురావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే లు బాపురావ్, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి,శ్యామ్ నాయక్, గజేందర్, ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.