
- జస్టిస్ షమీం అఖ్తర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆస్తులు పోయి జీరో అయినా చదువుంటే హీరో కాగలరని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ అన్నారు. బతికున్నంత కాలం విద్య ఉపయోగపడుతుందని, దానికి నిదర్శనం వైఆర్పీ ఫౌండేషన్చైర్మన్ రవి ప్రసాద్ అని అన్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ లోని వైఆర్పీ ఫౌండేషన్40 మంది పేద స్టూడెంట్స్కు రూ.9 లక్షల స్కాలర్ షిప్ లను ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి షమీం అఖ్తర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను అందజేశారు.
రవి ప్రసాద్ మాట్లాడుతూ.. 2024–25 అకడమిక్ ఇయర్లో 155 మంది పేద విద్యార్థులకు రూ.50 లక్షలు స్కాలర్షిప్స్ఇస్తున్నామన్నారు. ఇందులో ఎల్ కేజీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులున్నారని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ ఎమ్. జగదీశ్వర్, ఎడ్ల కృష్ణారెడ్డి, యోలిశాల శరత్ చంద్ర, యోలిశాల హేమ చంద్ర, యామ దయాకర్ , ప్రవీణ్ , చకిలం శేష గిరి రావు పాల్గొన్నారు.