బీసీ రిజర్వేషన్లు న్యాయబద్ధమే: కేఏ పాల్

బీసీ రిజర్వేషన్లు న్యాయబద్ధమే: కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు. 

సోమవారం కోర్టు తీర్పు అనంతరం ఆయన సుప్రీంకోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌‌ చేశారు.