V6 News

NBK 111: బాలయ్య ప్రాజెక్ట్‌లో హీరోయిన్ చేంజ్: నయనతార ప్లేస్‌లో మరో టాలీవుడ్ బ్యూటీ..!

NBK 111: బాలయ్య ప్రాజెక్ట్‌లో హీరోయిన్ చేంజ్: నయనతార ప్లేస్‌లో మరో టాలీవుడ్ బ్యూటీ..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK111’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ అనౌన్స్ చేయనప్పటికీ.. అలోమోస్ట్ తప్పుకుందని సినీ వర్గాలు అంటున్నాయి.

అయితే, నయనతార తప్పుకోవడానికి గల కారణాలు? నెక్స్ట్ బాలయ్యకి జోడీగా నటించేది ఎవరు? అన్న ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్లో మిగిలిపోయాయి. లేటెస్ట్గా ‘NBK111’ మూవీకి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. నయనతార స్థానంలో మరో టాలీవుడ్ బ్యూటీని గోపీచంద్ ఎంపిక చేసినట్లుగా సమాచారం. 

నయనతార ఎందుకు తప్పుకుంది?

ముందుగా ఈ చిత్రాన్ని ఒక భారీ హిస్టారికల్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చారిత్రక నేపథ్యంలో బాలయ్య సరసన రాణి పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన నయనతార పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే స్క్రిప్టు మార్పులు, కాల్ షీట్ సమస్యల వల్లే ఈ సినిమా నుండి నయనతార తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు, ఈ సినిమా కోసం నయనతార దాదాపు రూ. 8 నుండి 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత పెద్ద మొత్తం నయనతారకు ఇచ్చే బదులు, రూ. 2 కోట్లలోపు వచ్చే మరో హీరోయిన్‌ను తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నయనతార స్థానంలో ‘కాజల్ అగర్వాల్’ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట గోపీచంద్ మలినేని. ఇప్పటికే బాలకృష్ణతో కలిసి చేసిన భగవంత్ కేసరి హిట్ కావడంతో, అదే సెంటిమెంట్ కొనసాగించాలని భావిస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. 

ముంబై బ్యాక్‌డ్రాప్‌లో..

ఈ భారీ చారిత్రక కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను మార్చేశారని టాక్ వినిపిస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారని టాక్. బాలయ్య మార్క్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేసాడట డైరెక్టర్ గోపీచంద్.

►ALSO READ | Sai Abhyankar: ‘రాకా’ ఆల్బమ్‌పై బిగ్ అప్డేట్.. సౌండ్ ట్రాక్, సాంగ్స్‌పై మ్యూజిక్ డైరెక్టర్ ఓపెన్

ఈ మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, బాలయ్య మాస్ ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. అంతేకాకుండా, ఇటీవల 'అఖండ 2' ఫలితం, ప్రస్తుత ఓటీటీ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ మార్పులపై చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే కొత్త తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని, సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉంది. ముంబైలో భారీ సెట్టింగ్ వేసి, బాలయ్యపై భారీ యాక్షన్స్ సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా సమాచారం.