మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను పకడ్భందీగా నిర్వహించాలని,  ఫలితాలు మెరుగుపడేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  గురువారం   మాచారెడ్డి మండలం సోమార్​పేట జడ్పీ హైస్కూల్​ను కలెక్టర్​ తనిఖీ చేశారు.   క్లాస్​లను ఆయన పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వివిధ సబ్జెక్ట్​ ఆంశాలపై విద్యార్థులను కలెక్టర్​ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.  ఆయన మాట్లాడుతూ...  విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు.  ఉన్నత ఆశయంతో  కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులకు నోటుబుక్స్​  పంపిణీ  చేశారు. డీఈవో రాజు, టీచర్లు ఉన్నారు.  

సోమార్​పేట పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తండాలో  వడ్ల కొనుగోలు సెంటర్​ను కలెక్టర్​ తనిఖీ చేశారు.  జిల్లాలో మద్నూర్​ సీసీఐ సెంటర్​కే కాకుండా పత్తిని  తమకు సమీపంలోని జిల్లాల్లో ఉన్న పత్తి కొనుగోలు సెంటర్లకు పత్తిని రైతులు తరలించవచ్చని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  రైతులు తమకు దగ్గరగా ఉన్న వేములవాడ, దౌలతాబాద్​,  సిద్దిపేట, తోగుట సెంటర్లకు పత్తిని తీసుకెళ్లి అమ్ముకోవచ్చన్నారు.  

మన జిల్లా రైతుల కోసం స్లాట్​ బుకింగ్​లో ఈ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని సూచించారు.  ఎకరాకు 7 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు  ఏఈవో వద్ద  ఆన్​లైన్లో ఎంట్రీ చేయించుకోవాలన్నారు. అలాగే   జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ఈ నెలాఖరులోగా కంప్లీట్​ కావాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వా న్​ పేర్కొన్నారు. గురువారం  వడ్ల కొనుగోళ్లపై జిల్లా అధికారులతో  రివ్యూ  చేశారు.  సెంటర్లలో తక్షణమే తూకాలు చేయాలన్నారు.   సెంటర్ల నుంచి మిల్లులకు వడ్ల తరలింపు పక్రియ వేగంగా జరగాలన్నారు.అడిషనల్ కలెక్టర్​ విక్టర్  ,  అధికారులు ఉన్నారు.