నామినేషన్ సెంటర్లలో వసతులు కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 నామినేషన్ సెంటర్లలో వసతులు కల్పించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సెంటర్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను
కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై  అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. నామినేషన్​ స్వీకరణ సెంటర్లలో తగిన వసతులు ఉండాలన్నారు.  నామినేషన్​ ఫారాలు, ఓటరు లిస్టు,  సిద్ధం చేయాలని ఆదేశించారు. డిస్ర్టిబ్యూషన్​ సెంటర్లలో వసతులతో పాటు,  ఆయా రూట్ల మ్యాప్​లను రెడీ చేయాలన్నారు.  

బ్యాలెట్ బాక్స్​లను  జిల్లా కేంద్రం నుంచి తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో ర్యాంపులు,  నీటి వసతి,  కరెంట్​ఇతర సౌకర్యాలు  ఉండాలన్నారు.  మండల స్థాయిలో ఎలక్షన్​ ఫ్లాన్​ను ఎంపీడీవోలు తయారు చేయాలన్నారు.  పోటీ చేసే వారికి వ్యయ పరిమితులను ముందుగానే వారికి తెలియజేయాలన్నారు.  అడిషనల్ కలెక్టర్లు  వి.విక్టర్​, చందర్​నాయక్​, అడిషనల్​ ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళీ, జిల్లా , డివిజన్​, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.