కరోనా మనుషుల్ని చంపినా, భూమికి మేలు చేస్తోంది

కరోనా మనుషుల్ని చంపినా, భూమికి మేలు చేస్తోంది

ముంబై: బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కరోనా మహమ్మారి గురించి మాట్లాడింది. కరోనా మానవ తప్పిదమని, దాన్ని మనంతట మనమే తయారు చేసుకున్నామని చెప్పింది. కరోనా వైరస్ ఓ రకంగా మంచిదేనని.. మనుషుల్ని చంపినా, భూమికి మేలు చేస్తోందని తెలిపింది. 

‘మానవాళి తాను తయారు చేసిన ఓ వైరస్‌‌ను చూసి తానే బాధపడుతోంది. ఆర్థిక వ్యవస్థలను కూల్చేందుకు ఈ వైరస్‌‌ను రూపొందించారు. దీన్ని కొందరు ఒప్పుకోవచ్చు, మరికొందరు తిరస్కరించొచ్చు. కరోనా మనుషులను చంపుతున్నప్పటికీ భూమికి సాంత్వన చేకూరుస్తోందన్నది వాస్తవం. కాబట్టి కరోనాపై మంచి అభిప్రాయాలను ఏర్పరుచుకోండి. మనలోని అందరూ ఏడాదికి కనీసం 8 చెట్లను నాటాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఆహారాన్ని వృథా చేయొద్దు. ఏ బాధ్యతైనా మీరే తీస్కోండి. ఇతరులకు అప్పగించకండి’ అని కంగన ట్వీట్ చేసింది.