ఆమనగల్లు, వెలుగు : ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ శాంతికి దోహదపడతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మాడ్గుల్ మండలం అంతంపేటలోని ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని పూజలు చేశారు.
నియోజకవర్గ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్టలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ఆర్కపల్లిలో మృతి చెందిన కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
