కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : బాల్య వివాహాలు, శిశు విక్రయాలను అరికట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో అస్ర అంజుం అధికారులకు సూచించారు. మంగళవారం, కట్టంగూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చదువుకునే వయస్సులో పెండ్లిళ్లు చేస్తే అనారోగ్య సమస్యలను వస్తాయన్నారు.
శిశు విక్రయాలు నేరమని, ఎవరైనా శిశువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థినులతో బాల్య వివాహాలు అరికట్టాలని ప్రతిజ్ఞ చేశారు. కట్టంగూర్‌లో వివ్యార్థినులతో కలిసి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు బూరుగు శారదారాణి, పద్మావతి, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఎన్జీవో ఝూన్సీ, పాఠశాల ఎస్వో నీలాంబరి పాల్గొన్నారు.
