ఐదేండ్లలో అభివృద్ధి ఏంటో చూపించా : పువ్వాడ అజయ్ కుమార్

ఐదేండ్లలో అభివృద్ధి ఏంటో చూపించా : పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నియోజకవర్గంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని, ఐదేండ్లలో చేసి చూపించానని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం సిటీలోని శ్రీరామ భక్త గంటేలా నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వదా సభకు సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తాను పెద్దపీట వేశానని చెప్పారు.

రఘునాధపాలెం మండలాన్ని అన్నివిధాలా డెవలప్​ చేసి చూపించానన్నారు. ఖమ్మంలో వైకుంఠ ధామాలు, లకారం చెరువు, ట్యాంక్ బండ్, వాకింగ్ ట్రాక్స్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గోళ్లపాడు ఛానల్, ఆహ్లాదకరమైన పార్కులు లాంటి అభివృద్ధి పనులను ప్రజల ముంగిట ఉంచామని చెప్పారు. తుమ్మల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు  ట్యంక్ లతో నీరు అందించారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇంటి వద్దకే నల్లా నీళ్లు వచ్చేలా చేశామన్నారు.

తొలుత కళాకారుల పాటకు పువ్వాడ అజయ్ కుమార్ గొంతు కలిసి స్టెప్ లేసి, కార్యకర్తల్లో జోష్ నింపారు. సమావేశంలో సిటీ మేయర్ పూనుకోలు నీరజ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు తాతా మధు, మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజు, సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య, పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, వైరా అభ్యర్థి మదన్ లాల్, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రాష్ట్ర విత్తన గిడ్డంగి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాధపాలెం జడ్పీటీసీ ప్రియాంక, ఖమ్మంలోని ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

కేసీఆర్​ అడిగితేనే పోటీ చేస్తున్నా.. వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘కొత్తగూడెం నుంచి వనమా మీరే పోటీ చేయాలి’ అని సీఎం కేసీఆర్​ తనను అడిగితేనే తాను పోటీ చేస్తున్నానని, దీంతో తన జీవితం ధన్యమైందని కొత్తగూడెం బీఆర్​ఎస్​అభ్యర్థి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్​తనను చేరదీశారని  తెలిపారు.

ఆఖరి సారిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో 890 మందికి పైగా పేద ప్రజలకు పట్టాలిచ్చానన్నారు. మెడికల్​ కాలేజ్​ తీసుకువచ్చానన్నారు. మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. మరోసారి తనని గెలిపించాలని కోరారు. కాగా సభకు కేసీఆర్​ ఆలస్యంగా రావడంతో  సీఎం మాట్లాడకముందే చాలామంది వెళ్లిపోయారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థ సారధి రెడ్డి, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు

 ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ దిండిగాల రాజేందర్​, జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్​ చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి, నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, తెల్లం వెంకట్రావ్​, జేవీఎస్​ చౌదరి, దామోదర్​, లగడపాటి రమేశ్​, టీబీజీకేఎస్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. వెంకట్రావ్​, మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు. 

ALSO READ : హైదరాబాద్ భూగర్భ జలాల్లో డేంజర్​ కెమికల్స్​

పోలీస్​ల అత్యుత్సాహం.. ప్రజలకు అవస్థలు

పోలీస్​లు అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తగూడెం పట్టణంలో కేసీఆర్​ పర్యటన సందర్భంగా హోటళ్లు, షాప్​లను పోలీసులు మూసి వేయించారు. రోడ్డు మీద అమ్మకాలు లేకుండా చేయడంతో వీధి వ్యాపారులు పోలీస్​ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కావడంతో చేపల మార్కెట్​కు మస్తు గిరాకీ ఉంటుంది. చికెన్​ షాప్​లను కూడా పోలీస్​లు మూసివేయించడంతో జనాలకు తిప్పలు తప్పలేదు. బీఆర్​ఎస్​ రాజకీయ ప్రోగ్రామ్​కు శానిటేషన్​ సిబ్బందితో సెలవు రోజు పనిచేయించడం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

ప్లకార్డులతో నిరసన..

పాల్వంచలోని కేటీపీఎస్​లో 20 ఏండ్లుగా డ్రైవర్లుగా తాము పనిచేస్తున్నా రెగ్యులరైజ్​ లేదంటూ డ్రైవర్​గా పనిచేస్తున్న ఓ యువకుడు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. కారు గుర్తు పెట్టుకున్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం కారు డ్రైవర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.