పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీడీ అతీఖుల్లా తెలిపారు. మంగళవారం పిట్లం హైస్కూల్లో 12 రోజుల పాటు నిర్వహించిన ఖోఖో శిక్షణా శిబిరంలో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసి మాట్లాడారు. 58వ రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు పెద్దపల్లి జిల్లాలోని ఇండియన్ మిషన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు కవిత, దశరథం, డాకూరి వెంకట్రెడ్డి, ఇమ్రోజ్, రమణారావు, క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించిన కోవూరి శివకుమార్, విజయ్కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో దేవిసింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పీఈటీలు రాజు, ప్రియాంక, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
