ముంచుకొస్తున్న కిడ్నీ క్యాన్సర్ ముప్పు : మరో 25 ఏళ్లల్లో లక్షల మందికి ఎటాక్

ముంచుకొస్తున్న కిడ్నీ క్యాన్సర్ ముప్పు : మరో 25 ఏళ్లల్లో లక్షల మందికి ఎటాక్

2050 ఏడాది వచ్చేసరికి కిడ్నీ క్యాన్సర్ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని..  అధిక బరువు పెరగడం, సిగరెట్లు తాగడం, ఎక్సయిజ్ చేయకపోవడం, షుగర్, బీపీ వంటి కొన్ని అలవాట్లే ఈ పెరుగుదలకు ముఖ్య కారణమని తేలింది. ఈ అలవాట్లు నివారిస్తే లేదా జాగ్రత్త పడితే  కిడ్నీ క్యాన్సర్ రాకుండా నివారించొచ్చు. ఫాక్స్ చేజ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు చేసిన ఈ కొత్త అధ్యయనంలో కిడ్నీ క్యాన్సర్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఈ రీసర్చ్ ఫలితాలు యూరోపియన్ యూరాలజీలో ప్రచురించారు.

పెరుగుతున్న కిడ్నీ క్యాన్సర్ : రాబోయే 25 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసులు రెట్టింపు అవుతాయని పరిశోధకులు తెలుసుకున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల 35 వేల కొత్త కిడ్నీ క్యాన్సర్ కేసులు, 1 లక్ష 56 వేల మరణాలు జరగ్గా...  ప్రస్తుత ట్రెండ్ ఇలానే కొనసాగితే 2050 నాటికి ఈ లెక్కలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పెరుగుదలకు వైద్యులు, ప్రభుత్వ విధానాలు రూపొందించే యంత్రంగం  సిద్ధంగా ఉండాలి. ఈ అధ్యయనం కిడ్నీ క్యాన్సర్ ఎంత మందికి వస్తోంది, ఎంతమంది బతుకుతున్నారు వంటి కారణాల  గురించి మనకు తెలియజేస్తుంది అని ఫాక్స్ చేజ్ క్యాన్సర్ సెంటర్ యూరాలజీ విభాగం చైర్మన్, డాక్టర్ అలెగ్జాండర్ కుటికోవ్  తెలిపారు.

కిడ్నీ క్యాన్సర్లలో దాదాపు 5% నుండి 8% వంశపారంపర్యంగా వస్తుందని గుర్తించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా కిడ్నీ క్యాన్సర్ కేసులు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండ వ్యాధి, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల వస్తున్నాయి. బరువు కంట్రోల్లో ఉంచుకోవడం, బిపి,  షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, పొగత్రాగటం మానేయడం వల్ల ఈ ప్రమాదాన్ని  తగ్గిస్తాయని ఇంకా క్యాన్సర్‌ను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

►ALSO READ | DRDOలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. బిటెక్ పాసైతే అప్లయ్ చేసుకోవచ్చు..

కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు: 65 నుంచి 74 ఏళ్ల మధ్య వయసు వారిలో కిడ్నీ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లలలో ఈ క్యాన్సర్ తక్కువగా కనిపిస్తుంది. మంచి ట్రీట్మెంట్/ వైద్యం కోసం కిడ్నీ క్యాన్సర్ సంకేతాలను, లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. చాలా మంది కిడ్నీ క్యాన్సర్ సంకేతాలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు, ఇలా చేయడం వల్ల ఆలస్యంగా బయటపడుతుంది, ఇంకా కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు విస్మరించకూడని కిడ్నీ క్యాన్సర్ సంకేతాలు ఇవే.... 

*మూత్రంలో రక్తం
*మీ వెనుక భాగంలో, పక్కటెముకల కింద లేదా మీ మెడపై వాపు
*పక్కటెముకలు, నడుము మధ్య  నొప్పి
*ఆకలి లేకపోవడం
*అలసట

ఇతర లక్షణాలు:
*బరువు తగ్గడం
*శరీర ఉష్ణోగ్రత తగ్గకపోవడం
*ఎప్పుడూ అనారోగ్యంగా అనిపిస్తుండటం
*రాత్రిపూట కూడా ఎక్కువగా చెమటలు పట్టడం 
*రక్తహీనత(anemia)
*హై బిపి