
DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (DRDO, ITR) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29.
పోస్టుల సంఖ్య: 04. (జూనియర్ రీసెర్చ్ ఫెలో)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మొదటి తరగతిలో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 25.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.