
- నల్గొండ, కనగల్ పోలీసుల తీరు భరించలేకపోతున్నా
- 25 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ పీఎస్ గడప తొక్కలే
నల్గొండ, వెలుగు : 'మా గవర్నమెంట్ వస్తది..మాకు చాన్స్ రాదా...బాధితులు కాంప్రమైజ్ అయ్యాక కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొడ్తున్నరు..ఇది కరెక్ట్ కాదు’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ రూరల్‌పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన ఎస్ఐ భాస్కర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. నల్గొండ బుద్ధారంలో ఓ గొడవ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఇరుపక్షాలు గొడవలు వద్దని సర్ధి చెప్పుకున్నాక కూడా పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు రమ్మన్నావని ఎస్ఐని ప్రశ్నించారు. ‘తప్పు చేస్తే పిలిపించాలే తప్పా ఇరువర్గాలు గొడవ వద్దని అంగీకారానికి వచ్చాక కూడా ఎందుకు రమ్మన్నావ్’ అని అడిగారు.
ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పి ఎస్ఐ అందుబాటులో లేకుండాపోవడంతో ఎంపీ మరింత ఫైర్అయ్యారు. పాతికేండ్ల తన రాజకీయ జీవితంలో పోలీస్ స్టేషన్ల గడప ఎప్పుడూ తొక్కలేదని, తమ ప్రభుత్వంలో పనిచేసిన ఎస్పీలు ఇప్పుడు డీఐజీ ర్యాంకులో పనిచేస్తున్నారని, వాళ్లకు ఫిర్యాదు చేయడం పెద్ద విషయం కాదన్నారు. స్టేషన్లకు వచ్చే స్థాయి తనది కాకపోయినప్పటికీ కనగల్, నల్గొండలో పోలీసుల వ్యవహార శైలి భరించలేక రావాల్సి వస్తోందన్నారు.
కనగల్ ఎస్ఐ అంతిరెడ్డి కూడా ఉదయం 6 గంటలకే రైతుల ఇండ్ల మీదికి పోలీస్‌వ్యాన్ పంపిస్తుండని, మళ్లీ రాత్రి 11 గంటలకు ఇంటికి పంపిస్తుండని, ఏదో ఒక సాకు చూపించి, విచారణ పేరుతో రైతులను స్టేషన్లలో బంధించి చితకబాదుతున్నారని ఆరోపించారు. తనకు కూడా ఓపిక నశించిందని, కనగల్ మండలం సంగతి తాను చూసుకుంటానని, కానీ, నల్గొండ మండలాన్ని మంచిగా చూసుకోమని ఎస్ఐ భాస్కర్ రెడ్డికి హితవు పలికారు.