
- ఆ పార్టీ మునిగిపోయే నావ అని ఎప్పుడో చెప్పా
- జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉండు.. ఇక గెలవడు
- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని, ఆ పార్టీ మునిగిపోయే నావ అని ఎప్పుడో చెప్పానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కవిత చెప్తుందని, కాళేశ్వరం, ధరణి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉన్నాడని, ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీతోనే గెలిచాడని, ఇక గెలవడని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కనగల్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, సైదులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.