నేను బతికే ఉన్నాను.. కోట

నేను బతికే ఉన్నాను.. కోట

నేను బతికే ఉన్నాను.. చనిపోలేదంటూ స్వయంగా ప్రకటించుకున్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావటంతో.. ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయని.. 50, 60 కాల్స్ ను నేనే అటెండ్ చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. మార్చి 21వ తేదీ మంగళవారం ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు కోట శ్రీనివాసరావు.

సోషల్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు కోట శ్రీనివాసరావు.

అసలు విషయం తెలిసి సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. కొన్ని వెబ్ సైట్లలో కోట దుర్మరణం అంటూ వార్తలు రావటంతో.. చాలా మంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులతోపాటు కోట శ్రీనివాసరావు అవాక్కయ్యారు. ప్రతి ఒక్కరికీ బతికే ఉన్నానని చెప్పలేక మనోవేదనకు గురయ్యారు కోట. సినీ ఇండస్ట్రీకి.. అభిమానులకు, ప్రజలకు నిజం తెలియాలనే ఉద్దేశంతో.. నేను బతికే ఉన్నాను అంటూ.. ఆయనే స్వయంగా వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కోట శ్రీనివాసరావు..