జిల్లా కలెక్టరేట్ లో కాబోయే కలెక్టర్, కాబోయే ఎస్పీ పెళ్లి.. చాలా సింపుల్ గా..

జిల్లా కలెక్టరేట్ లో కాబోయే కలెక్టర్, కాబోయే ఎస్పీ పెళ్లి.. చాలా సింపుల్ గా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ ల వివాహం నిరాడంబరంగా జరిగింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్ ను మచిలీపట్నం కలెక్టరేట్ ఆమె ఛాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్‌ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. వీరిద్దరు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరిది రాజస్థాన్ రాష్ట్రం. కొత్త జంటకు జిల్లా కలెక్టర్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి తర్వాత ఇద్దరు శ్రీకొండాలమ్మ గుడికి వెళ్లారు.

యువ ఐఏఎస్ అధికారిణి ... ట్రైనీ ఐపీఎస్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కృష్ణా జిల్లాలో ఈ జంట వివాహం నిరాడంబరంగా జరిగింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్‌లు మచిలీపట్నం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో జిల్లా రిజిస్ట్రార్‌ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దండలు మార్చుకుని రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. కొత్త జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు

వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. అపరాజిత సింగ్‌ది కూడా రాజస్థాన్‌ కాగా.. ఏపీ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా ఉన్నారు.. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.