
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తు్న్నారు. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అంతా ఎమోషన్స్ తో నిండిపోయి కనిపించింది. కృష్ణ వంశీ తనదైన మార్క్ ను చూపించారు. వ్యక్తి జీవితంలోని అనుభూతులు, భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా కథ ముందుకు నడుస్తోంది.
బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక ఈ చిత్రాన్ని కాలెపు మధు, వెంకట్ కలిసి నిర్మించారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చాలా కాలం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.