
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్ దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. ఆగస్టు 4న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో హీరో పేరు కృష్ణ. తన లైఫ్ స్టోరీ ఇది. హీరో హీరోయిన్ సహా అందరి బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండాలని
ఆడిషన్స్ చేశాం.
అందులోనే రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీలను తీసుకున్నాం. వారిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి 20 నిమిషాల సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. నిర్మాత రఘురామ్ గారి సపోర్ట్‌తో అనుకున్న దానికంటే రెండు రోజులు ముందే షూట్ పూర్తి చేశాం. సాబు వర్గీస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలిచింది. వరికుప్పల యాదగిరి గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు’ అని చెప్పాడు.