అయ్యో.. కేసీఆర్ ప్రభుత్వం పోయిందా?.. కాంగ్రెస్ కు ఓటేసిన వారు మెసేజ్ చేస్తున్రు

అయ్యో.. కేసీఆర్ ప్రభుత్వం పోయిందా?.. కాంగ్రెస్ కు ఓటేసిన వారు మెసేజ్ చేస్తున్రు

సిరిసిల్లలో..  ఎవరెన్ని రకాలుగా ప్రలోభాలు, కుట్రలు చేసినా.. ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 6వ తేదీ బుధవారం  బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఆయన  చిత్రపటానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఎన్నికలల్లో అనుకోని ఫలితాలు రావడం సహజమని.. నిరాశ పడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్, పోరాటాల నుంచి వచ్చిన పార్టీ.. పోరాటాలు మాకేం కొత్తకాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడుతామన్నారు.

 అయ్యో.. కేసీఆర్ ప్రభుత్వం పోయిందా?.. అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతూ బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారని..  ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రానిస్తామని అన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని.. బీఆర్ఎస్ పార్టీని  ప్రజలు వదులుకోరని చెప్పారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.  సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, ముందు పంచనని మాట ఇచ్చా.. ఆ మాటను నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టారని కేటీఆర్ అన్నారు.