స్పీడ్ అంటే ఇదే.. 2.4 సెకన్లలో 100 కి.మీ! లంబోర్ఘిని కొత్త హైపర్ కార్.. కేవలం 15 మాత్రమే..

స్పీడ్ అంటే ఇదే.. 2.4 సెకన్లలో 100 కి.మీ! లంబోర్ఘిని కొత్త హైపర్ కార్.. కేవలం 15 మాత్రమే..

ఇటాలియన్ సూపర్‌కార్ తయారీ సంస్థ లంబోర్ఘిని  కొత్త ఫెనోమినో రోడ్‌స్టర్‌ కారుని లాంచ్ చేసింది. ఇదొక అత్యంత ప్రత్యేకమైన ఓపెన్-టాప్ హైపర్‌కార్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 15  మాత్రమే తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటివరకు కంపెనీ  ఉత్పత్తి చేసిన రోడ్‌స్టర్‌లలో ఇదే అత్యంత శక్తివంతమైనదని పేర్కొంది.

  ఇంజన్ పర్ఫార్మెన్స్ 
ఫెనోమెనో రోడ్‌స్టర్‌లో లంబోర్ఘిని  ఇంజన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. 6.5-లీటర్ల న్యాచురల్ V12 ఇంజిన్, హైబ్రిడ్ సెటప్ అంటే  ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు, 7 kWh బ్యాటరీ ప్యాక్, ఈ హైబ్రిడ్ సెటప్ మొత్తం 1,065 hp పవర్, 725 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది.

 టాప్ స్పీడ్ 
ఫెనోమెనో రోడ్‌స్టర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఓపెన్-టాప్ కార్ల లిస్టులో చేరింది. 
0-100 కిలోమీటర్లు కేవలం 2.4 సెకన్లలో.
0-200 కి.మీ కేవలం 6.8 సెకన్లలో
టాప్ స్పీడ్ వచ్చేసి  గంటకు 340 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్తుంది.

డిజైన్ & ఏరోడైనమిక్స్‌ 
ఈ కారు, లంబోర్ఘిని 'ఫ్యూ-ఆఫ్' ప్రోగ్రామ్ కింద నిర్మించిన 2025 ఫెనోమెనో కూపే కన్వర్టిబుల్ వెర్షన్. పైకప్పు లేకున్న ఛాసిస్, బాడీలో కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించడం ద్వారా దీని బలాన్ని కాపాడారు. కూపే  పైకప్పుపై అమర్చిన ఎయిర్ ఇన్‌టేక్‌ల స్థానంలో, సీట్ల వెనుక డ్యూయల్-బట్రెస్ సెటప్‌ను ఏర్పాటు చేశారు, ఇది కార్ దొర్లిపోకుండా రక్షణగా ఉంటుంది. వెనుక భాగంలో Y-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌లు, యాక్టివ్ రియర్ వింగ్  ఉన్నాయి.

ఇంటీరియర్ &  టెక్నాలజీ  
కారు క్యాబిన్ పూర్తిగా యుద్ధ విమానాల నుండి ప్రేరణ పొందింది. డాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌లు ఉంటాయి. ఒకటి 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, మరోకటి నిలువుగా ఉండే సెంట్రల్ టచ్‌స్క్రీన్, ఇంకోటి ప్రయాణీకుడి కోసం ఒక ప్రత్యేక స్క్రీన్ ఇచ్చారు. దీనికి యుద్ధ విమానంలో లాగా పైకి లేచే ఇంజిన్ స్టార్ట్ బటన్ ఉంటుంది.

టైర్లు & బ్రేకులు

 దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఫోర్జ్డ్ వీల్స్, బ్రిడ్జ్‌స్టోన్ పొటెంజా స్పోర్ట్ టైర్లతో పాటు, కార్బన్ సిరామిక్ బ్రేకులపై నడుస్తుంది.

కస్టమర్లకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చా 
అవును, లంబోర్ఘిని కస్టమర్లు  యాడ్ పర్సోనమ్  ప్రోగ్రామ్ ద్వారా వారి ఇష్టానుసారం కారు  రంగు, మెటీరియల్, ఫినిషింగ్‌ను మార్చుకోవచ్చు. లంబోర్ఘిని ఫెనోమెనో రోడ్‌స్టర్ అనేది టెక్నాలజీ, లగ్జరీ కలయిక. కేవలం 15 మంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ కారు, ఓపెన్-టాప్ డ్రైవింగ్ అనుభవాన్ని కొత్త అంచులకు తీసుకెళ్లే ఒక రోడ్-గోయింగ్ ఇంజనీరింగ్ అద్భుతం.