విజయ్ లియో నుంచి మాసివ్ పోస్టర్ రిలీజ్..

విజయ్ లియో నుంచి మాసివ్ పోస్టర్ రిలీజ్..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్(Vikram) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం..అలాగే విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్..సంజయ్ దత్ తో పోటీగా తలపడుతూ..ఇంటెన్స్ లుక్స్ లో ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. భారీ మంటల నడుమ సాగే ఈ ఫైటింగ్ ఏ రేంజ్ లో ఉండనుందో అర్ధం అవుతుంది. ఇక KEEP CALM AND  FACE THE DEVIL అనే ట్యాగ్లైన్ తో రిలీజైన ఈ పోస్టర్ లియో మూవిపై అమాంతం అంచనాలు పెంచేసింది.

ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా..యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన  హెరాల్డ్ దాస్ గ్లింప్స్..తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష(Trisha) నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.