ధనరేఖతో దండిగా లాభాలు.. లోన్​ కూడా పొందవచ్చు

ధనరేఖతో దండిగా లాభాలు.. లోన్​ కూడా పొందవచ్చు

బిజినెస్​ డెస్క్​, వెలుగు: మనదేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) మరో కొత్త   పాలసీని కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ధన్​ రేఖగా ఈ పిలిచే ఈ పాలసీ నాన్​–లింక్​, నాన్​–పార్టిసిపేటింగ్​, ఇండివిడ్యువల్​ లైఫ్​ సేవింగ్స్​ పాలసీ. పాలసీహోల్డర్లు దీని ద్వారా చాలా బెనిఫిట్లు పొందవచ్చు. మహిళలకు ప్రత్యేక ప్రీమియం రేట్లు వర్తిస్తాయని, థర్డ్​ జెండర్ వాళ్లు కూడా ధన్​ రేఖకు అర్హులేనని ఎల్ఐసీ ప్రకటించింది. అన్ని బెనిఫిట్లకూ పూర్తి గ్యారంటీ ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. 

పాలసీ కవరేజీ:

ఈ పాలసీకి కింద కనీసం కవరేజీ మొత్తం రూ.రెండు లక్షలు. మాగ్జిమమ్​ కవరేజీకి పరిమితి లేదు. ఎంట్రీ ఏజ్​ 90 ఏళ్ల నుంచి 8 ఏళ్లు. అయితే పాలసీ టెర్మ్​ను బట్టి వయోపరిమితి మారుతూ ఉంటుంది. పాలసీలో చేరడానికి కనీస గరిష్ట వయసు 35–55 ఏళ్లు. పీఓఎస్​పీఎల్​ఐ/కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు  సహా ఏజెంట్లు/మధ్యవర్తుల ద్వారా ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ మోడ్‌‌‌‌లో పాలసీ కొనొచ్చు. ఎల్​ఐసీ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నేరుగా కొనుగోలు చేయడానికి ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

తెలుసుకోవాల్సిన 5 విషయాలు:

పాలసీహోల్డర్ ప్రీమియం చెల్లించడం ముగిసిన తరువాత సర్వైవల్​ బెనిఫిట్​గా కొంతకాలానికి ఒకసారి చొప్పున కొంతమొత్తం చెల్లిస్తారు. బేసిక్​ సమ్​ ఎష్యూర్డ్​లో కొంత మొత్తాన్ని ఇస్తారు.  పాలసీ ప్రీమియాన్ని ఒకేసారి కట్టొచ్చు లేదా పదేళ్లకు, 15 ఏళ్లకు, 20 ఏళ్లకు ఒకసారి కట్టవచ్చు. మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా వాయిదాల్లో తీసుకోవచ్చు. డెత్​ బెనిఫిట్​ చెల్లింపులనూ కిస్తీలుగా తీసుకునేందుకు కూడా వీలు ఉంటుంది.  పాలసీ ముగిసిన తరువాత యాడిషన్స్​ను తప్పకుండా ఇస్తారు. ఇవి ఆరో పాలసీ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి
పాలసీ మెచ్యూరిటీ తరువాత పూర్తిస్థాయి సమ్​ ఎష్యూర్డ్ మొత్తాన్ని చెల్లిస్తారు. దీని నుంచి మనీ బ్యాక్​ మొత్తాన్ని మినహాయించరు. గ్యారంటీ యాడిషన్స్​ మొత్తాన్ని కూడా తీసేయరు. పాలసీకాలంలో పాలసీదారుడు మరణిస్తే ..  బేసిక్​ సమ్​ ఎష్యూర్డ్ , గ్యారంటీడ్​ యాడిషన్స్​ నుంచి 125 శాతం మొత్తాన్ని సింగిల్​ ప్రీమియం డెత్​ సమ్​ ఎష్యూర్డ్​గా చెల్లిస్తారు. లిమిటెడ్​ పేమెంట్​ ప్రీమియం అయితే.. బేసిక్​ సమ్​ ఎష్యూర్డ్​లో 125 శాతం లేదా ఆన్యువలైజ్డ్​ ప్రీమియంకు ఏడురెట్లు సమాన మొత్తం.. ఇందులో ఏది ఎక్కువైతే అది అందజేస్తారు. ఈ మొత్తం చెల్లించిన ప్రీమియాలకు 105 శాతం కంటే తక్కువ ఉండేలా చూస్తారు. 

డెత్​ ఫిన్​ఫిట్​ 

ఉదాహరణకు ఒక వ్యక్తి 28 ఏళ్ల వయసులో 20 ఏళ్లకు  ఇదే ఏడాదిలో రూ.10లక్షలకు పాలసీ తీసుకుంటే      డెత్ బెనిఫిట్​గా సమ్ అష్యూర్డ్ బేసిక్ సమ్ (12,50,000)లో 125 శాతం ఇస్తారు.  లేదా వార్షిక ప్రీమియం (రూ.721252) కంటే 7 రెట్లు ఎక్కువ ఇస్తారు. అంటే  డెత్​ బెనిఫిట్​ రూ.12,50,000 అవుతుంది.

ఎల్​ఐసీ జీవన్   పాలసీల్లో మార్పులు 

ఎల్​ఐసీ ఆఫ్ ఇండియా తన యాన్యుటీ ప్లాన్​ జీవన్ అక్షయ్ 7 (ప్లాన్ 857),  జీవన్ శాంతి(ప్లాన్ 858)కు సంబంధించిన  యాన్యుటీ రేట్లను సవరించింది. ఇవి మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి.  కొత్త యాన్యుటీ రేట్లతో ఈ ప్లాన్ల వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.  ఈనెల నుండి అమ్మకానికి వచ్చాయి. కొత్త జీవన్ శాంతి రెండు యాన్యుటీల మొత్తాన్ని ఎల్​ఐసీ వెబ్‌‌సైట్‌‌లోని కాలిక్యులేటర్ ద్వారా లేదా ఎల్​ఐసీ యాప్‌‌ ద్వారా లెక్కించవచ్చు.   జీవన్ అక్షయ్ 7 (ప్లాన్ నం 857) ప్లాన్​ను కొత్త డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ల తోపాటు డిస్ట్రిబ్యూషన్​ చానెల్స్​ నుంచి కూడా కొనొచ్చు. ప్లాన్‌‌లు ఆన్‌‌లైన్,  ఆఫ్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉన్నాయి.