ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఏడు ఆవులు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఏడు ఆవులు మృతి
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

తిర్యాణి, వెలుగు : పిడుగుపాటుతో ఏడు ఆవులు చనిపోయిన ఘటన ఆసిఫాబాద్​జిల్లాలో జరిగింది.  తిర్యాణి మండలం కైరుగూడ పంచాయతీ పరిధిలో గురువారం ఉరుములు, మెరుపుల కూడిన వాన పడింది. అటవీ ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లిన సమయంలో పిడుగుపాటుతో లక్ష్మీపూర్, కైరుగూడ శివారులో ఏడు ఆవులు మృతిచెందాయి. పశువుల కాపరి  నైతం రాముకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. గిరిజన రైతులకు జీవనధారంగా మారిన ఆవులు చనిపోయాయని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు, రైతు సంఘాలు కోరాయి.  

ఇద్దరికి గాయాలు 

కాగజ్ నగర్ : ఆసిఫాబాద్​జిల్లా కౌటాల మండలం బోదంపల్లిలో సాయంత్రం వర్షంతో పాటు పిడుగుపాటుతో  ఇద్దరు గాయపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పిల్లర్ పని చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుతో  పులబోయిన మల్లేశ్​ ఎడమ కాలిపై కాలింది. అభికి స్వల్ప గాయాలయ్యాయి. కౌటాల పీహెచ్ సీ లో చికిత్స చేసి  108లో కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.