ఎమ్మెల్యే అనుచరుడి కార్లోనే బ్యాగులు

ఎమ్మెల్యే అనుచరుడి కార్లోనే బ్యాగులు

హైదరాబాద్: ఫాంహౌజ్ ఎపిసోడ్ డ్రామాలో నిందితులు వాడిన కారు, బ్యాగులపై చాలా డౌట్లు వస్తున్నాయి. నిజానికి ఆ కారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడు దిలీప్ కుమార్ పేరుపై ఉంది. ఈ కారులోనే బ్యాగులున్నాయి. అందులోనే కోట్ల రూపాయలు ఉన్నాయంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ అందులో ఏమున్నాయో మీడియాకు మాత్రం చూపించలేదు. ఆ బ్యాగులపై ఎయిర్ వేస్ ట్యాగులు ఉన్నాయి.

అయితే నిందితుల దగ్గరకు ఎమ్మెల్యే అనుచరుడి కారు ఎందుకొచ్చింది ? పోలీసులు ఆ బ్యాగులో ఏమున్నాయో ఎందుకు చూపించలేదు ? లాంటి డౌట్స్ చాలా వస్తున్నాయి. అయితే పది రోజుల క్రితమే ఆ కారును స్వామిజీకి ఇచ్చామని స్వామిజీ అనుచరులు చెబుతున్నారు. ఆయన పూజలు చేస్తాడని మాత్రమే తమకు తెలుసని వారు అంటున్నారు.