ఏప్రిల్ 1 నుంచి లగ్జరీ కార్లు కొనేవారికి షాక్: భారీగా పెరగనున్న BMW, మెర్సిడెస్, ఆడి ధరలు !

ఏప్రిల్ 1 నుంచి లగ్జరీ కార్లు  కొనేవారికి షాక్: భారీగా పెరగనున్న BMW, మెర్సిడెస్, ఆడి ధరలు !

ఏప్రిల్ 1 నుంచి లగ్జరీ  కార్ల ధరలు పెరగనున్నాయి. దింతో బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి కాస్ట్లీ  కార్లను కొనాలనుకునే వారు ఇప్పుడు  ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే :
కార్ల కంపెనీలు ధరలు పెంచడానికి ముఖ్యంగా మూడు కారణాలు చెబుతున్నాయి. ఒకటి యూరో కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోవడం... ప్రస్తుతం 1 యూరో రూ. 100 కంటే ఎక్కువ ఉంది. దీనివల్ల విదేశాల నుంచి విడిభాగాలు తెప్పించుకోవడం కంపెనీలకు కాస్ట్లీగా మారింది.

మరొకటి కార్ల తయారీకి వాడే స్టీల్, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరలు పెరగడం. అలాగే కార్లను ఒక చోటు నుండి మరో చోటుకి తరలించే రవాణా ఖర్చులు లేదా లాజిస్టిక్స్ ఖర్చులు ఎక్కువవ్వడం.

ఏ కంపెనీ ఎంత పెంచుతోంది?
BMW & Mini కంపెనీలు ఏప్రిల్ 1 నుండి అన్ని మోడళ్లపై 2% వరకు ధరలు పెంచేసింది. మన దేశంలో తయారయ్యే కార్లతో పాటు, విదేశాల నుండి నేరుగా వచ్చే (CBU) కార్లకు కూడా ఇది వర్తిస్తుంది.

ఇక మెర్సిడెస్-బెంజ్  కూడా  అన్ని కార్లపై 2% వరకు ధరలను పెంచింది. సేల్స్ అలాగే బిజినెస్ సాఫీగా కొనసాగాలంటే ఈ పెంపు తప్పడం లేదని కంపెనీ తెలిపింది.

చివరికి పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆడి కూడా కార్ల ధరలు  2% వరకు పెంచేసింది. ఈ కంపెనీలు ఇప్పటికే 2026 జనవరిలో ఒకసారి ధరలను పెంచాయి. ఇప్పుడు కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచుతుండటం గమనార్హం.

►ALSO READ | కుప్పకూలిన స్టాక్ మార్కెట్ :13 లక్షల కోట్ల నష్టం! 1,800 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్...