కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో మహీంద్రా XUV 7XO విడుదల: టెక్నాలజీలో సరికొత్త రికార్డు...

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో మహీంద్రా XUV 7XO విడుదల: టెక్నాలజీలో సరికొత్త రికార్డు...

మహీంద్రా & మహీంద్రా ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా సంస్థ  పాపులర్ SUV అయిన XUV700ని కొత్త రూపంలో XUV 7XO పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.  మహీంద్రా ఈ కారు ధరను చాలా పోటీగా నిర్ణయించింది. అయితే, ఈ ధరలు  మొదటి 40వేల  బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

XUV 7XO  కొత్తగా ఏముందంటే : 

మహీంద్రా  కొత్త ఎలక్ట్రిక్ కార్ల స్టైల్‌ను ఈ XUV 7XOకి కూడా ఇచ్చింది. ముందు భాగంలో స్టైలిష్‌గా ఉండే C-షేప్ LED లైట్లు, వెనుక వైపు ఒకదానికొకటి కలిసిపోయేలా ఉండే (Connected) LED టైల్ లైట్లు ఉన్నాయి. పెద్ద 19-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ వల్ల కారు చూడటానికి చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

 ఇంటీరియర్ & టెక్నాలజీ :
కారు లోపల టెక్నాలజీ విషయంలో మహీంద్రా సరికొత్త రికార్డు సృష్టించింది. డాష్‌బోర్డ్ మీద మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్ కోసం ఒకటి, మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి, ముందు డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకుడి కోసం ప్రత్యేకంగా మరొక స్క్రీన్ ఇచ్చారు. వాయిస్ కమాండ్స్ కోసం ఏకంగా AI చాట్‌బాట్‌ను లోపలే ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ కోసం 16 స్పీకర్లు ఉన్న హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ఉంది. ఈజీ పార్కింగ్ అలాగే కారు చుట్టూ ఉన్నవన్నీ చూడటానికి 540-డిగ్రీ కెమెరా సిస్టమ్ అందించారు.

►ALSO READ | భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్లు.. బేర్స్ పంజాకు కారణాలు ఇవే..

ఇంజిన్ & సేఫ్టీ:
ఇంజిన్ విషయంలో పాత పవర్‌నే కొనసాగించారు. పెట్రోల్ వెర్షన్లో  2.0 లీటర్ టర్బో ఇంజిన్ 197 bhp శక్తిని, డీజిల్ వెర్షన్లో  2.2 లీటర్ mHawk ఇంజిన్ 182 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ వచ్చింది. అంటే ఈ SUV  చాలా సురక్షితమైన కారు. ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.   ఈ కారు బుకింగ్స్  సంక్రాంతి సందర్భంగా 14 జనవరి 2026 నుండి మొదలవుతాయి.

పెట్రోల్ వెర్షన్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 16.14 లక్షల నుండి, డీజిల్ వెర్షన్ టాప్ మోడల్ (AWD) ధర రూ. 30.18 లక్షల వరకు ఉంటుంది. షోరూమ్ ధర కంటే రిజిస్ట్రేషన్ (RTO), ఇన్సూరెన్స్ వంటి ఖర్చుల వల్ల ఆన్-రోడ్ ధరలు ఎక్కువగా ఉంటాయి.