
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు మాజీ ఎంపి వివేక్ విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ గురువారం కలిశారు. శ్రమ శక్తి భవన్ లోని కార్మిమ శాఖ మంత్రాలయంలో కేంద్ర మంత్రితో భేటీ జరిగింది. సింగరేణి కార్మిక సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. వీఆర్ఎస్ పేరుతో 800ల కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం గతంలో మాటిచ్చిందని, మెడికల్ బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించినా తర్వాత కూడా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేదన్న విషయాన్ని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దాదాపు 800 కుటుంబాల సంబంధించిన ఈ అంశంపై కేంద్ర మంత్రికి వివరాలతోకూడిన రిప్రజెంటేషన్ అందించారు. నష్ట పోయిన బాధిత కార్మికులతో చీఫ్ లెబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి చెప్పారు. చీఫ్ లేబర్ కమిషనర్ ఆధీనంలో సమస్యను పరిష్కరించాలని కోరామని, నా విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వివేక్ వెంకట స్వామి వివరించారు.