
హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్ ఎ.ఎస్.రావు నగర్‌లోని రాధిక ఎక్స్ రోడ్ ప్రాంతానికి మార్చిన షోరూమును ఘనంగా ప్రారంభించింది. దీనిని13,473 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రతి సందర్భానికి తగిన బంగారం, వజ్రాలు, అన్‌కట్ జెమ్ స్టోన్ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆఫర్లను ప్రకటించింది.
బంగారు నగల తరుగు చార్జీల పై 25శాతం వరకు తగ్గింపు ఉంటుంది. జెమ్ స్టోన్, అన్ కట్ ఆభరణాల తరుగు చార్జీల పై ఫ్లాట్ 25శాతం తగ్గింపు, వజ్రాల విలువపై 25శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.