
- మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని కోలిండియా స్థాయి క్రీడల్లో రాణించాలని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. సింగరేణి వర్క్పీపుల్స్ స్పోర్ట్స్అండ్గేమ్స్అసోసియేషన్ఆధ్వర్యంలో ఆదివారం మందమర్రి ఎల్లందు క్లబ్లో కార్మికులు, ఉద్యోగుల క్రీడలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ప్రతిఏటా క్రీడలు నిర్వహిస్తూ కార్మికులు, ఉద్యోగుల్లోని క్రీడనైపుణ్యాలను వెలికితీస్తోందన్నారు.
క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆటలకు అనుగుణంగా మైదానాలు ఏర్పాటు చేశామన్నారు. టేబుల్ టెన్నిస్, షటిల్, బాడీబిల్డింగ్, పవర్లిప్టింగ్క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఎస్.సత్యనారాయణ, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్రమేశ్, డబ్ల్యూపీఎస్అండ్జీఏ చీఫ్కోఆర్డినేటర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.