Balan: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడి మరో మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్

Balan: ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడి మరో మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్

‘మంజుమ్మల్ బాయ్స్’చిత్రంతో దర్శకుడిగా గుర్తింపును అందుకున్న చిదంబరం తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ కలిసి నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్‌‌తో ‘ఆవేశం’సినిమా తీసిన జీతూ మాధవన్ స్ర్కిప్ట్‌‌ను అందించాడు.

ఈ చిత్రానికి ‘బాలన్’ టైటిల్‌‌ను ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌లో ఓ బాలుడు షర్ట్ లేకుండా చేతిలో ఓ కట్టె పుల్లను పట్టుకుని వెనుక నుంచి కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కేవీఎన్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు  త్వరలో వెల్లడించనున్నారు.

మంజుమ్మల్ బాయ్స్:

మలయాళంలో 2024 ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys) సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‍తో రూపొంది దాదాపు రూ.230 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ స్పృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్,అరుణ్ కురియన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

►ALSO READ | నరేష్ అగస్త్య మరో డిఫెరెంట్ ఫిల్మ్.. ఆగస్టు 22న ఇన్‌‌‌‌ప్లూయెన్స్ చేసే మ్యూజికల్ లవ్‌‌‌‌స్టోరీ..

మంజుమ్మల్ బాయ్స్ కథ:

2006లో కేరళకు చెందిన కొందరు స్నేహితుల అంతా కలిసి తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‍లోని గుణ గుహలకు ట్రిప్ కు వెళతారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్‍లోని ఓ యువకుడు అనుకోకుండా ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్‍లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ లో ఆద్యంతం థ్రిల్లింగ్‍గా ఉత్కంఠభరితంగా చూపించారు మేకర్స్.