ఇంట్లోని వస్తువులతో ఇతగాడి ర్యాంప్ వాక్

ఇంట్లోని వస్తువులతో ఇతగాడి ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షో అనగానే వైవిధ్య భరిత దుస్తుల్లో హొయలొలికించే  మోడల్స్ ర్యాంప్ వాక్ గుర్తుకొస్తుంది. కానీ ఫిజీ దేశానికి చెందిన మోడల్ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్  కాస్త క్రియేటివ్గా ఆలోచించాడు. అట్ట పెట్టెలు, నిచ్చెన, బల్ల, కుర్చీ, మొక్కల తొట్టెలు, రేకులు, తలుపు, ఇంటి గేటు, మంచం పట్టీలు, నీటి డ్రమ్ము ఇవన్నీ వాడుకొని ఫన్నీ ఫ్యాషన్ షోతో దుమ్ము లేపాడు. దీనికి సంబంధించి ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో  నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

దీన్ని డాక్టర్ అజతీయ అనే నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఒకే ఒక్క రోజులో ఈ వీడియోకు 68 లక్షల వ్యూస్, 2.47 లక్షల లైక్స్ రావడం విశేషం.  క్రియేటివిటీ, హాస్య చతురతతో ఆకట్టుకుంటున్న  మోడల్ షహీల్ షెర్మాంట్పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అది దొంగతనమా.. ఫ్యాషన్ షోనా’ అని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు. ‘‘అది ప్యారిసా.. మిలానా’’ అంటూ మరొకరు వ్యంగ్య ప్రశ్నను సంధించారు.