స్వాతంత్ర్య దినోత్సవం రోజున గురుకుల విద్యార్థులకు పాడైన ఇడ్లీ

స్వాతంత్ర్య దినోత్సవం రోజున గురుకుల విద్యార్థులకు పాడైన ఇడ్లీ

స్వాతంత్ర్య దినోత్సవం రోజుల జెండా  ఎగురేసి విద్యార్థులకు చాక్లెట్లు..స్వీట్లు పంపిణీ చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సీ గురుకుల హాస్టల్ లో మాత్రం ఇడ్లీలు పెట్టారు. అది కూడా పూర్తిగా పులిసిపోయినా..పాడైన ఇడ్లీలు పెట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

స్వాతంత్ర్య దినోత్సవం రోజున(ఆగస్టు 15) పెద్దపల్లి జిల్లా మంథని ఎస్సీ సంక్షేమ వసతి గృహాంలో పాడైన ఇడ్లీ, సాంబార్ తమకు పెడుతున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఉదయం పెట్టాల్సిన ఇడ్లీని.. మధ్యాహ్నం పెట్టారని.. దాంతో ఇడ్లీలు మరింత పులసిపోయి, వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ అధికారుల తీరుకు నిరసనగా విద్యార్థులు పాడైన ఇడ్లీలతో హాస్టల్ నుంచి మంథని చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.  వీరికి ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతుగా నిలిచారు. 

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం

హాస్టల్ విద్యార్థులకు పాడైన ఇడ్లీ పెట్టారన్న సమచారంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు  బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా మంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.