బుల్లెట్ల కంటే బ్యాలెట్ గొప్పది : మచాడో పిలుపునకు దేశమే కదిలింది.. నోబెల్ బహుమతి వచ్చింది

బుల్లెట్ల కంటే బ్యాలెట్ గొప్పది : మచాడో పిలుపునకు దేశమే కదిలింది.. నోబెల్ బహుమతి వచ్చింది

నోబెల్ శాంతి బహుమతి 2025 గెలుచుకున్న వెలిజులా ఉక్కు మహిళ.. ఐరన్ లేడీ మరియా మచాడో. ఆమె ధైర్యసాహసాలు, తెగింపు, పోరాటం వల్లే గుర్తింపు పొందినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మూడే మూడు అంశాలు ఆమెను ఎంపిక చేయటానికి దోహదపడ్డాయని స్పష్టం చేస్తూ కమిటీ వెల్లడించింది. 

వెనిజులా దేశంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా స్థిరమైన శాంతియుత పోరాటం చేశారు. వెనిజుల దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో అందర్నీ ఏకం చేశారు. వెనిజుల దేశ ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, శాంతి కోసం ఆమె చేసిన పోరాటం, ఉద్యమం ఆ దేశ ప్రజల్లో ఆశను పుట్టించాయి. ఒకప్పుడు చాలా విభేదాలు ఉన్న రాజకీయ ప్రతిపక్షంలో ఆమె స్వేచ్ఛాయుత ఎన్నికలు అలాగే  ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కోసం అందరినీ కలిపింది. ప్రజాస్వామ్యానికి ఇదే ముఖ్యం. మన అభిప్రాయాలు వేరైనా, ప్రజాపాలన నియమాలను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు, ఈ ఐక్యత చాలా అవసరం.

ALSO READ : నోబెల్ శాంతి బహుమతి మరియా కొరినా మచాడో

ప్రభుత్వ హింస సొంత ప్రజలపైనే జరుగుతోంది. దాదాపు 8 కోట్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఎన్నికల మోసాలు, అక్రమ కేసులు, జైలు శిక్షల ద్వారా ప్రతిపక్షాన్ని అణచివేశారు. మచాడో గురించి, ఆమెకు నోబెల్ కమిటీ ఎందుకు అవార్డు ఇచ్చిందంటే....  

*మచాడో సుమాటే అనే సంస్థను స్థాపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచడానికి ఉన్న  సంస్థ. 20 సంవత్సరాల క్రితమే ఆమె స్వేచ్ఛాయుత, నిజాయితీగల ఎన్నికలకు మద్దతు ఇచ్చారు.

*ఆమె మాటల్లో చెప్పాలంటే, రాజకీయ పదవుల కోసం తుపాకీలను కాకుండా, బ్యాలెట్ (ఓటు) పద్ధతిని ఎన్నుకోవాలని ఆమె నమ్మారు.

*అప్పటి నుండి ఆమె న్యాయ స్వాతంత్రం మానవ హక్కులు, ప్రజల ప్రాతినిధ్యం కోసం గట్టిగా మాట్లాడారు.

*ఆమె 2024 ఎన్నికలకు ముందు వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.

*మచాడో ప్రతిపక్షం తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు, కానీ పాలకులు ఆమెను పోటీ చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత, ఆమె మరొక పార్టీ అయిన ఎడ్ముండో గొంజాలెజ్ ఉరుటియాకు మద్దతు ఇచ్చింది.

*రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. పౌరులపై వేధింపులు, అరెస్టులు, హింస జరిగే ప్రమాదం ఉన్న, వారికి ఎన్నికలను పర్యవేక్షించేవారిగా శిక్షణ ఇచ్చారు.

*ప్రభుత్వం ఓట్లను నాశనం చేసి, ఫలితాల గురించి అబద్ధాలు చెప్పకముందే, లెక్క  చేసుకున్నారు.