
ఇప్పటివరకూ చూడని విజయ్ దేవరకొండని ‘లైగర్’ సినిమాలో చూడబోతున్నారని ఊరిస్తున్నాడు పూరి జగన్నాథ్. సినిమా టైటిల్ మొదలు విజయ్ లుక్ వరకూ అన్నీ కొత్తగానే ఉన్నాయి. అయితే ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో కొత్త డైమెన్షన్స్ విజయ్‌లో చూడబోతున్నామట. ముఖ్యంగా మునుపెన్నడూ చేయని మాస్ స్టెప్పులేస్తున్నాడట విజయ్. నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఈ విషయం రివీల్ చేసింది. ‘ముంబైలో లైగర్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరుస్తున్నాడు.
నన్ను నమ్మండి.. మాస్ క్రేజీగా ఉండబోతోంది అతని డ్యాన్స్. ఆ పెర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను’ అంటూ ఛార్మి ట్వీట్ చేసింది. ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మాస్ నంబర్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీని పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.