
- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సూచన
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకొని సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం ఆయన నాంపల్లిలోని మీడియా అకాడమీలో ట్రైబల్జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విడతల వారీగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ట్రైబల్ జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు.