ఒకేసారి నాలుగు సినిమాలతో మెగాస్టార్ బిజీబిజీ

ఒకేసారి నాలుగు సినిమాలతో మెగాస్టార్ బిజీబిజీ

స్టార్ హీరోలంతా వరుసగా చాలా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు. అయితే దాదాపు అందరూ ఒక సినిమా కంప్లీటయ్యాకే మరో మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తుండడం, ఆ నాలుగు సినిమాల షూటింగ్ ఒకే నెలలో జరుగుతుండటం మాత్రం అరుదు. చిరంజీవి ఈ రేర్ ఫీట్ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆచార్య, గాడ్‌ ఫాదర్, భోళాశంకర్ సినిమా లతో పాటు బాబి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న మూవీ కూడా సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉంది. వీటన్నింటిలో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు చిరు.

ఇది ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ మెగా రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికి ఇది రేర్ రికార్డు కావచ్చు కానీ ఒకప్పుడు ఒకే రోజు రెండు, మూడు సినిమాల షూటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న రోజులు చిరంజీవి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో ఒక సినిమా కంప్లీట్ చేయడానికే ఏడాది పడుతోంది. అలాంటిది ఈ ఏజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మెగాస్టార్ ఇలా ఒకే నెలలో నాలుగు సినిమాలకు పని చేస్తూ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోలకు పోటీనివ్వడం చిన్న విషయం కాదు. వీటిలో ముందుగా ‘ఆచార్య’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల. ఇదిలా ఉంటే ‘అఖండ’తో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.