సీఎం సిద్దిపేట టూర్‌‌‌‌‌‌‌‌ తో హరీశ్ రాజకీయ పతనం షురూ

 సీఎం సిద్దిపేట టూర్‌‌‌‌‌‌‌‌ తో హరీశ్ రాజకీయ పతనం షురూ
  • పీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనతో హరీశ్ రావు రాజకీయ పతనం ప్రారంభమైందని పీసీసీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తుండటంతో.. ఎక్కడ తన మోసాలు, అక్రమాలు, భూ దందాలు బయటపడతాయోననే భయంతో హరీశ్ వణికిపోతున్నారని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

త్వరలోనే సిద్దిపేటకు పట్టిన హరీశ్ పీడ విరగడ కానుందన్నారు. గత 20 ఏండ్లుగా సిద్దిపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. సిద్దిపేటలో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలుకానుందని  పేర్కొన్నారు. త్వరలోనే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.