- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కల్లూరు/పెనుబల్లి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగ్రామం నారాయణపురం వచ్చిన సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని నాయకులు కార్యకర్తలు తోపాటు ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులకు కాంగ్రెస్ కండువాలు కప్పి సన్మానించారు.
రాఘవరెడ్డి 8వ వర్ధంతి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తండ్రి దివంగత పొంగులేటి రాఘవరెడ్డి 8వ వర్ధంతి నారాయణపురం గ్రామంలో బుధవారం నిర్వహించారు. రాఘవరెడ్డి స్మృతి వనం వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేకపూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

