మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మహబూబాబాద్, వెలుగు: మానుకోట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో మెడికల్ విద్యార్థుల కోసం రూ. 250 కోట్లతో నిర్మించిన బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాల సముదాయం, క్రిటికల్ కేర్ యూనిట్, డైనింగ్ హాల్, కిచెన్ బిల్డింగులను నేడు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్​ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్​ ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం పడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.