ఇల్లు లేదా బాత్ రూమ్ క్లిన్ చేసే విషయానికి వస్తే ఆలోచన లేకుండా అతిగా చేయడం లేదా ఫ్లోర్ క్లీనర్లను అత్యుత్సాహంగా కలపడం లేదా రెండు క్లీనర్లను కలపకూడదని మీకు తెలుసా.... పల్మనాలజీ & స్లీప్ మెడిసిన్‌లో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంకిత్ భాటియా రెండు వేర్వేరు టాయిలెట్ క్లీనర్‌లను కలిపినందున ఒక మహిళా ఎమర్జెన్సీ కింద హాస్పటల్లో చేరిన సంఘటనను చెప్పుకొచ్చారు.
టాయిలెట్ క్లీనర్లను కలిపితే ఎం జరుగుతుంది:
ఇది మీకు ఏం కాదులే.. ఎం అవుతుందిలే అని అనిపించవచ్చు... కానీ డాక్టర్ భాటియా ప్రకారం ఆ మహిళా బాత్రూమ్ శుభ్రం చేసేందుకు రెండు టాయిలెట్ క్లీనర్లను కలిపినప్పుడు విషపూరిత పొగలు వెంటనే అక్కడ వ్యాపించాయి. నిమిషాల్లోనే ఆమె ఊపిరి ఆడక కుప్పకూలిపోయింది దింతో ఆమెని ఎమర్జెన్సీ లో చేర్చాల్సి వచ్చింది.
ఆ పొగలు క్లోరిన్ వాయువును ఉత్పత్తి చేశాయి, ఇది రియాక్టివ్ ఎయిర్‌వే డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (RADS)ను పుట్టించాయి. ఇది మీ గొంతు, ముక్కు వాయుమార్గాల తీవ్రమైన ఇబ్బంది, చికాకు కల్గిస్తాయి.
టాయిలెట్ శుభ్రం చేసేటప్పుడు సురక్షితంగా ఎలా ఉండాలంటే :
1. టాయిలెట్ క్లీనర్లను బ్లీచ్, ఆమ్లాలు లేదా ఇతర క్లీనర్లతో ఎప్పుడూ కలపవద్దు. అలా చేయడం వల్ల విష వాయువులు ఉత్పత్తి అవుతాయి, ఇది మీకు హాని కలిగించవచ్చు, ముఖ్యంగా మూసివేసిన ప్రదేశాలలో. ఇది మీ ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీస్తుంది.
2. ఒకేసారి ఒక క్లినర్ మాత్రమే వాడండి. నిపుణుల సలహా, సంప్రదించకుండా ప్రయోగాలు చేయకుండా ఉండటం మంచిది.
3. క్లినర్ పై ఉన్న లేబుల్‌ను జాగ్రత్తగా చదవండి. క్లినర్ వాడేటప్పుడు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.
4. మీ వాష్‌రూమ్‌ని ఎప్పుడూ వెంటిలేట్ చేయండి . గాలి కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను ఆన్ చేయండి, స్వచ్ఛమైన గాలి వీచేలా చూసుకోండి.
5. మీరు తడిసిపోవడం లేదా మరకలు పడటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సేఫ్టీ కోసం చేతి గ్లవుజులు, పాత బట్టలు ధరించండి.
కలపకూడని క్లీనింగ్ ఉత్పత్తులు:
చాలా మంది ఒక క్లినర్ బాగా పనిచేస్తే, దానిని మరొక క్లినర్ తో కలపడం ఇంకా బాగా పనిచేస్తుందేమో అని భావిస్తారు, ముఖ్యంగా కఠినమైన, మొండి మరకలపై. కానీ కొన్ని క్లినర్లను కలపకూడదు, ముఖ్యంగా క్లినింగ్ ఉత్పత్తుల విషయానికి వస్తే. అవి విషపూరితంగా కనిపించకపోవచ్చు, కానీ వాటి ప్రభావాలను ముందే పూర్తిగా ఊహించలేము.
ALSO READ : Winter Special: చలికాలంలో రక్షణ కవచంలా ఉపయోగపడే ఉన్ని దుస్తులను ఇలా అస్సలు ఉతకొద్దు..!
మీరు ఎప్పుడూ కలపకూడని కొన్ని క్లినర్ ఉత్పత్తులు ఉన్నాయి, ఎందుకంటే అవి క్లోరిన్, క్లోరమైన్ వంటి విష వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి దగ్గు, శ్వాస ఆడకపోవడం, కంటి చికాకు లాంటి మరిన్ని సమస్యలను కలిగిస్తాయి.
1. బ్లీచ్ & వెనిగర్
2. బ్లీచ్ & అమ్మోనియా
3. బాత్రూమ్ క్లీనర్లు & బ్లీచ్
4. నిమ్మకాయ & బ్లీచ్
5. బేకింగ్ సోడా & వెనిగర్
6. బ్లీచ్ & రుబ్బింగ్ ఆల్కహాల్

