అడ్డగూడూరును డెవలప్‌‌ చేస్తా : ఎమ్మెల్యే మందుల సామెలు

అడ్డగూడూరును డెవలప్‌‌ చేస్తా : ఎమ్మెల్యే మందుల సామెలు
  • ఎమ్మెల్యే మందుల సామెలు 

యాదాద్రి, వెలుగు:  వెనకబడిన అడ్డగూడూరును డెవలప్ చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేలు చెప్పారు.  కొత్త పోలీస్ స్టేషన్, ఎంపీడీవో ఆఫీసుల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​ అన్నారు. 

శనివారం అడ్డగూడూరులో కొత్తగా నిర్మించే రెండు భవనాల నిర్మాణ పనులను కలెక్టర్​హనుమంతరావును కలిసి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మండలం ఏర్పాటు చేసినా భవనాలు నిర్మించలేదన్నారు. తమ ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణాలకు ఫండ్స్​ రిలీజ్​ చేసిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి  పాల్గొన్నారు.