గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను .. 20 టీఎంసీలకు పెంచేందుకు ప్రపోజల్స్

గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను .. 20 టీఎంసీలకు పెంచేందుకు ప్రపోజల్స్

గద్వాల, వెలుగు : నెట్టెంపాడు లిఫ్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను 1.5 టీఎంసీ నుంచి 20 టీఎంసీలకు పెంచేందుకు ప్రపోజల్స్ పెట్టామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం తన క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సర్వే కోసం రూ.16.20 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. 

 భూ నిర్వాసితులు, సాగునీటి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.25 కోట్లు ఇచ్చిందని తెలిపారు. గద్వాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. అనంతరం ధరూర్ మండలం నెట్టెంపాడు లిఫ్ట్ లో భాగంగా గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ఫేస్ వన్ పంప్ హౌస్ నుంచి నీటిని ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.