అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే గడ్డం వినోద్

 అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే గడ్డం వినోద్
  • ప్రభుత్వ సలహాదారుడిని కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్​

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి సహకరించాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డిని ఎమ్మెల్యే గడ్డం వినోద్​ కోరారు. మంగళవారం హైదరాబాద్​లో నరేందర్​ రెడ్డి నివాసంలో పలువురు నాయకులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. బెల్లంపల్లిలో బస్​ డిపో నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు. 

పట్టణంలో 100 పడకల ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలు, యంత్రాలు, సరిపడా డాక్టర్లు, పారామెడికల్​సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. బల్దియాలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అనంతరం సింగరేణి భవన్​లో సీఎండీ​బలరాం నాయక్​ను కలిసి బెల్లంపల్లి నియోజకవర్గంలో సింగరేణి పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్​ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, నాయకులు కె.రాంచందర్, దావ రమేశ్, ఎం.నర్సింగారావు ఉన్నారు.