కరీంనగర్, వెలుగు: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీసీ రిజర్వేషన్లపై పాడిన పాడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ బీసీల యుద్ధం పుట్టిందిరా’ అంటూ వరంగల్ శ్రీనివాస్ రాసి, మ్యూజిక్ అందించిన పాటకు గంగుల కమలాకర్ నిర్మాతగా వ్యవహరించారు.
శ్రీకాంత్, హరిణితోపాటు గంగుల స్వయంగా రెండు చరణాలు పాడారు. ‘తెలంగాణ గులాబీలురో మా వీరులు.. తెగదెంపుల నినాదాలురో మా శూరులు.. పోరులోన ఒరిగినవాళ్లు మా వీరులు.. పోరాడే గెలుస్తారురో మా శూరులు..’ అంటూ పాటలో ఆయన కొంతభాగం పాడారు.
