
దుబ్బాక, వెలుగు: వడగండ్ల వర్షంతో చేతికొచ్చిన పంట రైతుల కళ్లేదుటే నేలరాలిపోయి బోరున విలపిస్తుంటే కలెక్టర్ భూభారతి సదస్సులకు వెళ్లడమేంటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం తొగుట మండలం కాన్గల్, లింగంపేట, తొగుట, పెద్దమాసాన్‌పల్లి, బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, గుడికందుల, గోవర్ధనగిరి గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేల పరిహారాన్ని ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.