- ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ రూపురేఖలు మారేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. సోమవారం క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో సింగరేణి, ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. గత రెండేండ్లుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వివిధ స్కీమ్‌ల ద్వారా దాదాపు రూ.800 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి రామగుండంను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
దీంతోపాటు స్కూళ్లు, కాలేజీలు నిర్మించి ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని రూరల్ ఏరియాలకు అనుసంధానం చేస్తూ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సింగరేణి నిధులతో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించి వ్యాపార అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు బీఆర్‌ఎస్ లీడర్లు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. మీటింగ్‌లో లీడర్లు మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్, దీటి బాలరాజు, సుజాత, లింగస్వామి, ముస్తఫా, రమేశ్, పెద్దెల్లి ప్రకాశ్, విజయ్
పాల్గొన్నారు.
